బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా సంబరాలు
తెలుగుదేశం పార్టీ నాయకులు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి టిడిపి మళ్లీ అఖండ విజయాన్ని సాధించుకోవడంతో బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా సంబరాలు చేసుకొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద విగ్రహానికి పూలమాలవేసి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ టిడిపి రావడం అనేది మాకెంతో గర్వకారణం అని అన్నారు. వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కక్ష సాధింపులు కుళ్ళు కుతంత్రాలకు దీటుగా నిలబడి టిడిపి విజయం సాధించింది. ఏపీ ప్రజలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
