ఉమ్మడి నిజాంబాద్ జిల్లా బ్యూరో
జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన సురేష్ షెట్కార్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.సురేష్ షెట్కార్ గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.రెండు సార్లు వరుసగా బీఆర్ఎస్ పార్టీ నుండి జహీరాబాద్ ఎంపీగా పనిచేసి, ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బి.బి పాటిల్ యొక్క సొంత నియోజకవర్గమైన జుక్కల్ లో మరియు సొంత ఊరిలో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్లు రావడంతో.. కాంగ్రెస్ పార్టీ పట్ల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు యొక్క చిత్తశుద్ధి మరియు సురేష్ షెట్కార్ గెలుపు కోసం తాను చేసిన కృషిని గురించి తెలుసుకొని ముఖ్యమంత్రి , కాంగ్రెస్ పార్టీ పెద్దలు అభినందించారు.
గత రెండు సార్లు (2014, 2019) జుక్కల్ లో మరియు బి.బి పాటిల్ సొంత ఊరిలో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ రాగా,ఇప్పుడు ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్లు రావడంతో,ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వల్లే ఇది సాధ్యం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
