Saturday, February 21, 2026

మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారం

ప్రతి ఒక్కరి భాధ్యత పర్యావరణాన్ని రక్షించాలి

ప్రజా భవన్ లో మొక్కలు నాటిన మంత్రి

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
జూన్ 5

హైదారాబాద్ మహాత్మా జ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. మాట్లాడుతూ చెట్లు మానవాళికి, మనిషి మనుగడకు జీవనాధారం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి చెట్లను పెంచడం, వాటిని సంరక్షించడం చేయాలని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది.

మానవ జాతి మనుగడకు తొలి మెట్టు చెట్టు అని మనమందరం భాధ్యత తీసుకొని మన పరిసరాల చుట్టూ మన ఇళ్ల చుట్టూ మీరు పని చేసే కార్యాలయ ఆవరణం లో చెట్లను నాటాలి. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కంకణ బద్దులం కావాలని మంత్రి అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular