Saturday, February 21, 2026

ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం

వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మీడియా తో మాట్లాడుతూ, అధికారం లో ప్రజలకు అనేక విధాలుగా మేలును చేశాం. మంచి నీటి సమస్య తో పాటు అనేక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ, నాకు ఓటు వేసి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఎమ్మెల్యే గా గెలిచిన జివి ఆంజనేయులు కి అభినందనలు తెలియజేశారు. వినుకొండ ను అభివృద్ధి చేస్తూ, ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయం పాటించాలని సూచించారు. ఎవరూ కూడా అధైర్య పడాల్సిన పరిస్థితి లేదని మీకు నేను అండగా అన్ని వేళలా అందుబాటు లో ఉంటామని తెలిపారు. ఓటమి శాశ్వతం కాదని గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular