మంజీరా కు గుండె కోత.
ఫోటో రైటప్ : ట్రాక్టర్లలో తరలిస్తున్న ఇసుక.
బోధన్ రూరల్ : ట్రాక్టర్లలో ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా బోధన్ మండలం ఖండ్గావ్,సిద్ధాపూర్ శివారులోని మంజీరా నుంచి ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా అధికారులు సైతం గండి కొడుతున్నారు.ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ మంజీరాలో నుంచి ఇసుకాసురులు ఇసుకను తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.ట్రాక్టర్ల అతివేగంతో ప్రయాణికులు పలు గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ప్రజలు సంబంధిత అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న ఇసుకాసురులపై అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీన్నిబట్టి అధికారులకు ఏమిరా ముడుపులు చేరుతున్నాయోనని ప్రజలు అనుకుంటున్నారు.
— ఒక వే బిల్లు 20 ట్రాక్టర్లతో ఇసుక తరలింపు.

రెవెన్యూ శాఖ వారి వద్ద నుంచి ఇసుకాసురులు ఒక్క వే బిల్లు పర్మిషన్ తీసుకుని 20 ట్రాక్టర్లతో వందల సంఖ్యలో ట్రిప్పులు తోలుతున్నారు.వే బీల్లు అమ్మ ఆదర్శ పాఠశాల పనుల కొరకు మరియు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు అని అనుమతులు తీసుకుంటూ పట్టణంలోని పలు వీధులలో మరియు గ్రామీణ ప్రాంతాలలో ఖాళీ స్థలాలను అడ్డగా మార్చుకొని డంపు చేసుకుంటున్నారంటూ ఆరోపణలు లేకపోలేదు.అధికారుల పర్యవేక్షణ,ఆర్టీవో వాహనాలు తనిఖీలు చేయకపోవడం వలననే ఈ దుస్థితి నెలకొంటుంది అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
— ఆర్టీవో అధికారుల నిర్లక్ష్యం అద్దం పడుతుందా !

ట్రాక్టర్లలో ఇసుకను అనుమతులతో రవాణా చేస్తున్నప్పటికీ అర్హత కలిగిన డ్రైవర్లు,వాహనాల ఫిట్నెస్,పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పర్యవేక్షణ ఆర్టీవో అధికారిపై ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.బోధన్ మంజీరా పరివాహక ప్రాంతం నుంచి ట్రాక్టర్లు మరియు టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్న ఆర్టీవో అధికారి ఒకసారి కూడా వాహనాలను తనిఖీ చేయకపోవడం పట్ల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పలు ట్రాక్టర్లకు అనుమతి లేకపోవడంతో పాటు ట్రాక్టర్ల యొక్క జీవితకాలం ముగియంతో ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి.ప్రమాదాలు చోటుచేసుకుని అనేక ముందు ఈ ప్రయాణికులు,ట్రాక్టర్ల డ్రైవర్లు ఆసుపత్రుల పాలు కావడంతో పాటు మరణించిన సందర్భాలు కోకోలలో.
— వేళ్ళని రెవెన్యూ అధికారులు వైపే.

రెవెన్యూ అధికారులు డబ్బులు దండుకొని వే బిల్లులు అమ్ముకుంటున్నారంటూ బోధన్ ప్రాంత ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.దీనిపై డివిజన్ మరియు జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో గండి కొడుతున్న రెవెన్యూ అధికారులు మరియు సిబ్బందిపై కఠిన చర్యలను తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.డివిజన్ మరియు జిల్లా అధికార యంత్రాంగం ఏ మేరా చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాల్సిందే.
— మైనింగ్ అధికారుల పర్యవేక్షణ కరువుతోనే మంజీరాకు గుండె కోత వస్తుందా.

మంజీరా లో అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి.ఇందుకు మైనింగ్ అధికారుల పర్యవేక్షణ లోపాలే కారణమంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.దీంతో భూగర్భ జలాలు అడుగంటి మంజీరా పరివాహక ప్రాంతంలోని రైతులు మరియు గ్రామాలకు నీటి కొరత తీవ్రమవుతుందని మంజీరా పరివాహక ప్రాంత రైతులు,ప్రజలు ఆవేదన చెందుతున్నారు.ఇప్పటికైనా మైనింగ్ అధికారులు పర్యవేక్షణ చేసి అనుమతుల మేరకే ఇసుక తవ్వకాలను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు మరియు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

