సిపిఐ జిల్లా కార్యాలయంలో అమరులు కామ్రేడ్ చండ్ర.రాజేశ్వర్ 110వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు 28 సంవత్సరాల పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అమరజీవి చండ్ర రాజేశ్వరరావు పని చేశారని ఆయనకు ఉన్న వందల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగిందని అన్నారు. చివరికి సొంత ఆస్తులు లేకపోయినా పార్టీ కార్యాలయంలోనే ఉంటూ జీవనం కొనసాగించారని అన్నారు ఆయన ఆశయ సాధన సమ సమాజం కోసం ప్రతి కార్యకర్త కూడా చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యదర్శి వై.ఓమయ్య, సిపిఐ జిల్లా నాయకులు బి.రఘురాం, అంజలి, హనుమాన్లు,సాయిలు తదితరులు పాల్గొన్నారు
