Saturday, February 21, 2026

సుదర్శన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

బోధన్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పట్టణ అధ్యక్షుడు మోయిన్ పాషా మాట్లాడుతూ ఎంపీ అరవింద్ నువ్వు ఎన్నిసార్లు గెలిచినా మాకు ఒరిగేది ఏమీ లేదు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు ఇంకొకసారి చేస్తే బాగుండదు మీ రక్తంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ నేడు నీవు బిజెపిలో చేరి మతోన్మాదంతో గెలిచిన తీరు నీది బి ఆర్ఎస్ బిక్ష తోటే నీవు గెలిచావని జిల్లా బోధన్ అభివృద్ధిలో నీ పాత్ర శూన్యమని నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణానికి పసుపు బోర్డు తీసుకువస్తానని హామీ ఇచ్చి బి ఆర్ ఎస్ చేసిన పనిని నేనే చేశానని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో బాండ్ పేపర్లు రాసిచ్చి విఫలమై దేనికి పనికిరాని వాడవని నిరూపించుకున్నావు. కానీ బిజెపి పార్టీ దయవల్ల మరోసారి ఎంపీగా గెలిచావని విరవియులకు అహంకార పూరిత బావజాలాన్ని మార్చుకోకపోతే నియోజకవర్గంలో తిరిగే అవకాశాన్ని కూలిపోతావు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హయాంలో మంచినీటి వసతి పరిశ్రమ ఎత్తిపోతల పథకం విద్యా కళాశాలలు ప్రభుత్వ విద్య పాఠశాలలో సౌకర్యాలను కల్పిస్తున్నారు. రైతులు పండించే పంటకు సాగునీరు ఎరువులు గురించి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పై ఎంతో అవగాహన ఉన్నా సుదర్శన్ రెడ్డి దానిని ఎలా తెరిపించాలో అని ఎంతో కృషి చేస్తున్నారు. చాతనైతే ఆయనకు సహాయం చేసి రైతులకు, ప్రజలకు సహాయం చెయ్యి విమర్శలు కాదు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి, డిసిసి డెలికేట్ గంగా శంకర్, ప్రముఖ నాయకులు శరత్ రెడ్డి, నాగేశ్వరరావు,విష్ణువర్ధన్, దాము, గౌసుద్దీన్, సంజీవ్, అన్నం పల్లి ఎల్లమయ్య, శ్రీకాంత్ గౌడ్, తలారి నవీన్, రమేష్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular