ద్రోణ బోధన్
జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గం లోని వర్ని మండల్ ఎస్ ఎన్ పురం గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని బూతులు కలిసి బాన్సువాడ నియోజకవర్గంలోనే అన్ని గ్రామ పంచాయతీల కంటే అత్యధిక మెజార్టీ ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని కొని యాడారు. రాబోవు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పిటిసిలను కూడా ఇదే రీతిలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సహకారంతో గెలుపొందాలని మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాస్ రావు నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం నియంతలాగా వ్యవహరిస్తూ ఉండేవారని, ఏనుగు రవీందర్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఆనాటి నుండి నేటి వరకు బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉండడం ఎంతో అభినందనీయమన్నారు. నాటి శాసనసభ ఎన్నికల్లో 25000 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైనప్పటికీ నేడు పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది వేల పైచిలుకు మెజార్టీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించడం ఏనుగు రవీందర్ రెడ్డి కృషి ఫలితమేనని కాంగ్రెస్ నాయకులు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ప్రస్తుత సమయంలో నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తీరుతామని ఎలమంచిలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏనాడు నిరుత్సాహపడకుండా పోరాటం చేస్తూనే ఉన్నారని వారి పోరాట ఫలితంగానే నేడు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో సత్తా చాటుకుందన్నారు.
