ఎంపీ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు










పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలను ఎన్నటికీ మరువనని ఎంపీ సురేష్ షేట్కార్ స్పష్టం చేశారు. కోటగిరి మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా నారాయణఖేడ్ లోని ఎంపీ స్వగృహంలో కలిశారు. గెలుపొందిన ఆయనకు కాంగ్రెస్ నాయకులు పూల మాలలతో సత్కరించి ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో తనకు సుమారు 9000 ఓట్ల మెజార్టీ రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఎంపీ అన్నారు. తన గెలుపుకు తన గెలుపుకు కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి తో పాటు, కోటగిరి మండలంలోని నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోటగిరి ప్రాంతాన్ని ఎన్నటికీ మరువనని తన పరిధిలో ఉన్న నిధులతో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తన గెలుపుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోటగిరి మండలంలో తన గెలుపుకు కృషి చేసిన నాయకులకు ఎంపీ అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బాన్సువాడ నియోజకవర్గం లో పర్యటిస్తానని ఎంపీ కోటగిరి నాయకులకు తెలిపారు. పదో తేదీ అనంతరం తన పర్యటన ఖరారు చేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు తన పర్యటన సమాచారం అందజేస్తానని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలబడతానని ఆయన అన్నారు. ఎవరెన్ని కుయుక్తులు కుతంత్రాలు చేసిన ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపడం ఎంతో అభినందనీయమన్నారు. ఆయనను కలిసిన వారిలో మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్, మాజీ జెడ్పిటిసి శివరాజ్ దేశాయ్, కొత్తపల్లి విండో అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, పాత్రికేయులు వి ఎం శివకుమార్, కనకమెడల శ్రీనివాసరావు (వాసు) నిజాంపేట్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
