ఈనాడు పత్రికా సంపాదకులు రామోజీరావు మృతి సమాజానికి తీరని లోటు అని కొత్తపల్లి విండో అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి అన్నారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు, వారి కుటుంబానికి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. రామోజీరావు పత్రికా రంగంలో, వ్యాపార రంగంలో మరి ఇతర ఎన్నో రంగాల్లో రాణించి సమాజంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. పత్రికా రంగంలో ఏనాడు మచ్చలేని తిరుగులేని దిగ్గజంగా సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోయారని, ప్రజలను ఎన్నో విషయాల్లో చైతన్య పరచడం ఆయనకే సాధ్యమని డాక్టర్ కొనియాడారు. సమాజంలో జరిగే అవినీతి అక్రమాలలో ఏనాడు రాజీ పడే ధోరణితో నడుచుకోలేదని, ప్రభుత్వాలు, నాయకులు ప్రజాప్రతినిధులు ఎవరు తప్పు చేసినా ఏలెత్తి చూపుతూ, ప్రజల పక్షాన ఆయన జీవితం పోరాటం చేసిన మహా శక్తి శాలుడని అన్నారు. సమాజంలో తప్పు చేసిన ఎంతోమంది గుండెల్లో రైళ్లు పరిగెత్తించరాని అన్నారు. తెలుగు ప్రజలు ఆయనను ఆదర్శంగా తీసుకొని నడుచుకుంటే ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు సంపాదించుకునే వీలు కలుగుతుందన్నారు. భారతదేశంలోనే రామోజీరావు అంటే తెలియని వ్యక్తులు ఉండరాని అన్నారు. ఆయన కొనసాగించిన ఏ రంగంలోనూ కుల మతాలకు అతీతంగా వ్యవహరించే వారన్నారు. రామోజీరావుని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని డాక్టర్ సునీల్ కుమార్ పిలుపునిచ్చారు.
