Saturday, February 21, 2026

రామోజీరావు మరణం పట్ల తెలుగు తమ్ముళ్ల సంతాపం

ద్రోణ బోధన్

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత లెజెండ్ రామోజీరావు మరణం పట్ల తెలుగుదేశం పార్టీ బోధన్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం బోధన్ లో సమావేశమైన తెలుగుదేశం నాయకులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామోజీ అమర్ రహే అని నినాదాలు చేశారు. సమావేశంలో మాట్లాడిన నాయకులు తెలుగుజాతికి పత్రిక రంగాన్ని మరియు జర్నలిజాన్ని రామోజీరావు చేసిన సేవలను కొనియాడారు. నిబద్ధతతో కూడిన జర్నలిజాన్ని ఐదు దశాబ్దాలుగా కొనసాగించటం సామాన్య విషయం కాదని ఏ రాజకీయ పార్టీకి బహిరంగ మద్దతు తెలుపకుండా పక్షపాతం వహించకుండా అన్ని వర్గాల పార్టీలకు చెందిన వార్తలను ప్రజలకు యధావిధిగా అందజేసి తన నిబద్ధతను చాటుకున్నారని కొనియాడారు. పత్రికా రంగంతోపాటు వివిధ వ్యాపార సంస్థలను నెలకొల్పి ఎందరో వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత రామోజీరావు దని తెలియజేశారు. జర్నలిజంలో నూతన వరవడి సృష్టించి సామాజిక అంశాలు తోపాటు ప్రజలను చైతన్యపరిచే విధంగా కథనాలను ప్రచురించడం ఈనాడు ప్రజలకు అందించిన చైతన్యమని తెలియజేశారు. సామాజిక ఉద్యమాలు తెలుగు నేలపై పురుడు పోసుకొని తమ ఆకాంక్షల మీద ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి సహకరించాయని అన్నారు. పత్రికలు భవిష్యత్తులో కూడా ఇదే ప్రమాణాలు పాటించాలని అభిప్రాయపడ్డారు.

రామోజీ ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ సంతాప సమావేశంలో తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి న్యాయవాది, సిహెచ్ వి హనుమంతరావు, ఉపాధ్యక్షులు పావులూరు వెంకటేశ్వరరావు, బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ కోట గోపాల్ రెడ్డి, తెలుగు యువత నాయకులు రావెళ్ల శ్రీనివాస్, తెలుగు విద్యార్థి నాయకులు సచిన్ పటేల్, పార్టీ నాయకులు విఠల్ పటేల్, కృష్ణారెడ్డి, రవికుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular