రామోజీరావు మరణించిన సందర్భంగా బోధన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం బోధన్ పట్టణంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో సంతాప సభను నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ సందర్భంగా బోధన్ ప్రింట్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు తెల్ల రవి మాట్లాడుతూ రామోజీరావు మరణం మీడియా రంగానికి తీరని లోటు అన్నారు.ఆయన మీడియా రంగానికి చేసిన సేవలను కొనియాడారు.ఆయన నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ పర్యాటక కేంద్రంగా దేశంలోనే ప్రాముఖ్యతను సంతరించుకుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సలహాదారుడు బల రామ్ రాజు,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,రాజులాల్,మధు,స్వామి,రాజేష్,జగన్,మేరాజ్,రఫిక్ హైమద్,గోపి,సునీల్ తదితరులు పాల్గొన్నారు.
