ద్రోణ కామారెడ్డి

ఎన్నికల హామి నిలబెట్టుకున్న ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఇంటి నిర్మాణం కోసం జీతం నుండి 4లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎన్నికల హామి ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని మిగిలిన జీతం డబ్బులు ప్రజలకే వెచ్చిస్తానని చెప్పిన విషయం నియోజకవర్గ ప్రజలందరికి విధితమే. అందులో భాగంగా
గాంధారి మండలంలోని సర్వాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వెంకట్ ఇటీవల చనిపోయారు. వెంకట్ కుటుంబానికి అండగా నిలుస్తామని తన ఎమ్మెల్యే జీతంతో వెంకట్ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తాను అని మదన్ మోహన్ వెంకట్ కుటుంబానికి హామి ఇచ్చారు. ఈరోజు వెంకట్ కుటుంబానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ జీతం నుండి 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కొరకు అందజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల,గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎం వై ఎఫ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
