Saturday, February 21, 2026

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం

ద్రోణ కామారెడ్డి

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, గతంలో నాతో పాటు ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదిగారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు.
ఎల్లారెడ్డి మండలం వెళ్ళుట్ల పేట గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బట్టలు మరియు పుస్తకాలు పంపిణిచేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ స్కూల్ లోనే చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలకు ఏది సాటిరాదని, మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇంకా ఎందరో మంది అత్యున్నత పదవులలో కొనసాగుతున్న ఐఏఎస్ లు, ఐపీఎస్ లు చాలా మంది ప్రభుత్వ బడులలో చదువుకున్నవారే. తల్లి దండ్రులు అందరూ ఆలోచించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో నే చేర్పించాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular