Saturday, February 21, 2026

పాఠశాల ప్రారంభం రోజే విద్యార్థులకు దుస్తులు

దేశంలో కొత్త ఒరవడికి రేవంత్ సర్కార్ శ్రీకారం
పాఠ‌శాల ప్రారంభ రోజే రోజే యూనిఫాంలు విద్యార్థులకు అందజేయనున్న ప్రభుత్వం
మహిళా సంఘాలకు స్టిచింగ్ బాధ్యతలు
రూ. 50 నుంచి రూ. 75 కు పెంచిన రేవంత్ సర్కార్.
పూర్తయ్యేలా మంత్రి సీతక్క చొరవ
విజయవంతమైన ప్రభుత్వ ప్రణాళిక.

ద్రోణ హైదరాబాద్

మొదటి రోజే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేయాలన్న ప్రభుత్వ ల‌క్ష్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు సకాలంలో స్టిచింగ్ పనులు పూర్తయ్యేలా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మ‌రియు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రణాళిక బద్దంగా వ్యవహరించారు. మహిళా సంఘాలకు స్టిచింగ్ పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పగించిన నాటి నుంచి, ఎప్పటికప్పుడు అధికారులను, మహిళా సంఘాలను సమన్వయపరుస్తూ గడువు లోగా పాఠశాలకు యూనిఫాం లు చేరేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మొదటి రోజే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేయాలన్న ప్రభుత్వ ల‌క్ష్యాన్ని నేర‌వేర్చినందుకు ఒక ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు స్టిచ్చింగ్ పనులను అప్ప‌గించారు. యూనిఫాం స్టిచింగ్ పనులను దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం అప్ప‌గించినందుకు మంగ‌ళ‌వారం నాడు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి మహిళ సంఘాల తరుపున మంత్రి సీతక్క ధన్యవాదములు తెలియ‌జేశారు.సకాలంలో పనులు పూర్తి చేసేలా వ్యవహరించిన మహిళా సంఘాలు, ప్రిన్సిపాల్ సెక్రటరీ, కమిషనర్, పిర్ అండ్ ఆర్‌డి, సీఈఓ సెర్ఫ్, కల్లెక్టర్లు, అధికారులకు, డిఆర్డిఒ, అడిషనల్ డిఆర్డిఒ, డిపిఓలు ఏపిమ్’, సిసి’ఎస్ మరియు ఇతర అధికారులను మంత్రి సీతక్క అభినందించారు.
పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ కి సిద్దం అయ్యాయి. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు మొద‌టి రోజే అంద‌జేస్తారు. గతంలో స్టిచ్చింగ్ పనులను పరిమిత సంఖ్యలో టైలర్లకు అప్పగించడం వల్ల, యూనిఫాంలు ఆలస్యమయ్యేవి. పాఠశాల ప్రారంభమైన మూడు నాలుగు నెలల వరకు విద్యార్థులకు యూనిఫాంలు అందేవి కావు. ఈ సమస్యను గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కొత్త ఒరవడికి శ్రీకారం చూట్టారు. దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు స్టిచింగ్ పనులను అప్పగించింది. దీంతో పాటు 50 రూపాయలున్న కుట్టు కూలీని 75 రూపాయలకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం,దీంతో మహిళా సంఘాలు యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులను సవాలుగా తీసుకోని, సకాలంలో పూర్తి చేయగలిగాయి.రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సంఘ సభ్యులు ఉండగా 18000 విలేజ్ ఆర్గనై షన్లు ఉన్నాయి. వారికి 15, 30,603 (ఒక జత) యూనిఫామ్ లు కుట్టాలని ప్రభుత్వం ఆదేశించగా, ఇప్పటివరకు 90% యూనిఫాంలు పూర్తయ్యాయి. మహిళా సంఘాలు సహాయకులుగా ఈ పనిని చేసినందుకు ప్రభుత్వం తరుపున అభినందనలు తెలుపుతున్నాం. సుమారు 50 కోట్ల స్టిచ్చిoగ్ ఆదాయం, ప్రతి సoవత్సరం సమకూరుతుంది.
భవిష్యత్ లో కూడా మహిళ సంక్షేమా కార్యక్రమాలు ద్వారా, ఇంక ఆదాయం పరమైన పనులు అప్పగించడం జరుగుతుంది. దానితో పాటు రెండవ జత, వారికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు రోజులలో ఇతర ప్రభుత్వ స్టిచింగ్ పని కూడా ఎస్ జి.ఎస్’లకు ద్వారా జరుగుతుందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular