నిజాంసాగర్, పిట్లం మండల కేంద్రాలలోని ప్రభుత్వ పాఠశాలలో ‘ఆచార్య జయశంకర్ బడిబాట’ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.బడిబాట కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు సాధర స్వాగతం పలికారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న యూనిఫామ్ మరియు పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ చరిత్రలో మొట్టమొదటి సారిగా పాఠశాలలు ప్రారంభం అయిన మొదటి రోజే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందిస్తున్నామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వానికి విద్య పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని అన్నారు.పాఠశాల భవనాల పునర్నిర్మాణానికి మరియు మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు క్రమశిక్షణ నైపుణ్యత కలిగి ఉంటారు అని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉచిత దుస్తులు అన్ని లభిస్తాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.విద్య సమాజంలో మనకు గుర్తింపు ఇస్తుందని, మన యొక్క స్థితిగతులను మారుస్తుందని, అందుకే ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని అన్నారు.
ఉపాధ్యాయుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని తన తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు అని ఈ సందర్బంగా తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎటువంటి ఆత్మనూన్యతా భావానికి లోనవ్వొద్దని తాను మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా ఎందరో మేధావులు, నాయకులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించారని చెప్తూ విద్యార్థులలో ప్రేరణ కలిగించారు.ఈ మధ్య వెలువడిన పదో తరగతి ఫలితాలను చూసినట్లయితే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారని తెలిపారు.


