ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం గావించిన సందర్భంగా బోధన్ పట్టణంలో టిడిపి నేతలు సంబరాలు జరుపుకున్నారు.ఈ సంబరాలకు బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.టిడిపి నేతలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం టిడిపి నాయకులు,అభిమానులు పట్టణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ పై చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
