Saturday, February 21, 2026

శభాష్ పోలీసు

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ పోగొట్టుకున్న రూ 34 వేల రూపాయలను నైట్ పెట్రోలింగ్ డ్యూటీ లో ఉన్న ఏ ఎస్ ఐ రమేష్ కానిస్టేబుల్ సత్యనారాయణ హోంగార్డ్స్ చిన్నప్ప, గోపయ్య కు తెలపగా వారు వెంటనే స్పందించారు.
ఏఎస్ఐ రమేష్ కానిస్టేబుల్ సత్యనారాయణ హోంగార్డ్స్ గోపయ్య చిన్నప్పను అభినందించిన సీఐ చరమందరాజు ఎస్సై ముత్తయ్య.హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న వారు కోదాడ నుండి హుజూర్ నగర్ కు వస్తూ రాత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ డబ్బులున్న సంచి మర్చిపోయారు. ఇదే విషయం పై హుజూర్ నగర్ పోలీసు స్టేషను నైట్ పెట్రోలింగ్ లో ఉన్న ఎ ఎస్ ఐ రమేష్ కు తెలపగా వెంటనే స్పందించి మిర్యాలగూడ డిపో కి పోన్ చేసి డ్యూటీ ఉన్న అర్ టి సి ద్రైవర్ నెంబరు తీసుకుని పోన్ చేసి విషయం చెప్పగా బస్సు డ్రైవర్ అదే బస్ లో వీళ్ళు మర్చిపోయిన సంచిని, అదే సంచిలో ఉన్న వారీ దుస్తులు ₹34000 లను గుర్తించి వాటిని మిర్యాల గూడెం డిపో లో అప్పగించారు. పోలీసులు వాటిని రికవరీ చేసుకొని గురువారం బాధితులకు హుజూర్ నగర్ సీఐ చరమందరాజు ఎస్ ఐ ముత్తయ్య ఎ ఎస్ ఐ రమేష్ చేతుల మీదగా బాధితులకు అందజేశారు. ఈ సందర్బంగా సీ ఐ చరమందరాజు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణం లోని ఫణిగిరి గట్టు వద్ద నివాసం ఉంటున్న ఆవుల శంభయ్య లక్ష్మీ దంపతులు వీరి కులం బుడబుక్కల. వృత్తి యాచక వృత్తి. వీళ్ళు మేడారం జాతర,భద్రాచలం ,వీరభద్ర స్వామీ దేవాలయవద్ధ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. వారు ₹34000 లున్న నగదు సంచి తో బుదవారం రాత్రి కోదాడ నుండి హుజూర్ నగర్ కు వచ్చేందుకు మిర్యాల గుడెం డిపో కు చెందిన అర్ టి సి డీలక్స్ TS 05 Z 0217 బస్ లో ప్రయణం చేస్తూ రాత్రి 11 గంటల సమయంలో హుజూర్ నగర్ లో దిగారు. నగదు ఉన్న సంచి బస్ లోనే మర్చి పోవడం తో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులకు పిర్యాదు చేసారు. పిర్యాదు తీసుకున్న ఎ ఎస్ ఐ రమేష్ చాకచక్యం గా వ్యవహరించి బాదితునికి ₹34000 నగదు దుస్తులు ఉన్న నగదు ను ఇప్పించారు. ఎ యస్ ఐ రమేష్ ను పోలీసులు స్తానిక ప్రజలు అభినందించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular