Thursday, February 19, 2026

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం

ద్రోణ హైదరాబాద్

ఆసిఫాబాద్ జిల్లా మోతుగూడ లోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరమ్మతులు చేశామని పేదలకు అందని ద్రాక్ష గా ఉన్న ఉన్నతమైన విద్య అందించే భాధ్యత మన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే భాధ్యత మాపైన ఉందని మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular