Saturday, February 21, 2026

అమ్మో ప్రభుత్వ ఆసుపత్రులా

పోతంగల్ వైద్యుల నిర్లక్ష్యం

జబ్బు ఏదైనా సరే గోలి ఇచ్చి పంపడమే

కాలం చెల్లిన మందులు గగ్గోలు పెడుతున్న రోగులు

వైద్యులను నిలదీసిన రోగులు

పొరపాటు జరిగిందంటూ వైద్యుల సమాధానం

ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ భవనాలు నిర్మించడం వైద్యులను నియమిస్తూ, ప్రతినెల కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నప్పటికీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవడం పట్ల ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే అమ్మో ప్రభుత్వ ఆసుపత్రా అంటూ ఎంతో మంది రోగులు పేదవారైనప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు సిబ్బంది పనితీరు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వైద్యులు విధినిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం వహించడంతో వారు కింద పని చేసే సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం లాబరేటరీలను, మరియు కోట్లాది రూపాయలు వెచ్చించి పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఏవైనా పరీక్షలు అవసరం ఉంటే ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరిస్తున్నాయి. చేసేదేమీ లేక రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. డబ్బున్న వారు ఎంత వెచ్చించైనా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి చికిత్సలను పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు మాత్రం అనారోగ్యానికి గురయ్యారంటే వైద్యం పొందేందుకు పడరాన్ని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందుదామంటే అరిచేతులు ప్రాణాన్ని పెట్టుకొని వెళుతున్నట్లు ఎంతోమంది రోగులు వెళ్లగక్కుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందుదామంటే వేలాది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అనారోగ్యానికి గురైన వారు ఎలా నైనా తమ ప్రాణాన్ని రక్షించుకోవడమే ధ్యేయంగా భావిస్తూ, వైద్య చికిత్సల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పోతంగల్ వైద్యులు

రోగం ఒకటి. ఔషధం మరొకటి

కాలం చెల్లిన మందులు

వైద్యులను నిలదీస్తున్న రోగులు

నిజామాబాద్ జిల్లా కోటగిరి, పోతంగల్ మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఆస్పత్రులలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం తారాస్థాయికు చేరింది. రోగులు ఎంతోమంది ఎన్నోమార్లు గగ్గోలు పెట్టినప్పటికీ వారు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. గత 5 రోజుల క్రితం పొతంగల్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి హెగ్డోలి గ్రామానికి చెందిన శోభ అనే మహిళ వైద్య చికిత్సలు చేయించుకున్నారు. వైద్యులు అందుబాటులో లేరు, మెడికల్ అధికారి సైతం విధులకు గైరాజరయ్యారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.ఇంతవరకు అంతా బాగానే ఉంది. వైద్య సిబ్బంది రోగికి కాలం చెల్లిన మందులను అందజేశారు. మరోపక్క శోభ కుమార్తె షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ నయం చేసే మందులను అందించాల్సి ఉండగా ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది సాయి కుమారి ఇతర మందులను అందించి చేతులు దులుపుకున్నారు. అప్పటికే షుగర్ కు చెందిన టాబ్లెట్లు ఇవి కావని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది మాకు తెలుసా మీకు తెలుసా అని రోగానికి తగిన మందులు కాకుండా ఇతర మందులను అందజేశారు. మందులను తీసుకువెళ్లిన మహిళ ఇంటి వద్ద తన అనుమానాలను నివృత్తి చేస్తుంది. షుగర్ ప్రతిసారి ఇచ్చే మందులు ఇవి పోల్చుకుంటే మహిళ అనుమానం నిజమైంది. రోగానికి ఇచ్చిన మందులు ఏమాత్రం సంబంధం లేకపోవడం మహిళ ఆశ్చర్యానికి గురైంది. ఈ విషయాన్ని ఆనాడే కొంతమందికి తెలియపరచింది. వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. తాను పని ఒత్తిడిలో ఉండడంతో పొరపాటు జరిగిందని ఆ మందులను తెరిస్తే రోగానికి తగిన మండల అందజేస్తానని మహిళను సమదాయించింది. అంతవరకు కథ సుఖాంతంగానే ముగిసినట్లు అయింది. మరోపక్క షుగర్ వ్యాధికి సంబంధించిన టాబ్లెట్లు వాడుకుందాం చూస్తే కాలం చెల్లిన టాబ్లెట్లుగా నిర్ధారణ అయినాయి. వారి కుటుంబ సభ్యులు లబోదిబో మంటూ సమాజానికి నాలుగో స్తంభంగా ఉండే జర్నలిస్టులను ఆశ్రయించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం కావాలంటే విలేకరులను కలిస్తేనే సాధ్యమన్న నమ్మకం మాత్రం నేటికీ ప్రజల్లో నాటుకుపోయింది. తమకు సమాచారం ఇచ్చిందే తడవగా భావించి ఎంతో మంది జర్నలిస్టులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరు రోగులకు భయాన్ని కలిగిస్తుందని శోభ ఆవేదన వెలిబుచ్చారు. ఆస్పత్రి సిబ్బందిని జరిగిన విషయంపై నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే రోగులకు భయం కలుగుతుందని మహిళ ఆవేదనతో పాటు ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఆసుపత్రి వర్గాలు సముదాయించే ప్రయత్నం చేశారు. కాలం చెల్లిన మందులు ప్రతినెల తొలగించాల్సిన మెడికల్ ఇంచార్జ్ నిర్లక్ష్యం రోగికి శాపం గా మారిందని పలువు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను కాలం చెల్లిన మందులు తొలగించారని సిబ్బందికి తెలవక కాలం చెల్లిన మందులు అందించడం జరిగిందని ఇంచార్జ్ సమాధానం చెబుతూ చేతులెత్తేశారు. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన, ఆసుపత్రికి జవాబుదారీగా ఉండే వైద్యులు మాత్రం గురువారం సైతం విధులకు ఎగనామం పెట్టారు. కాలం చెల్లిన మందులు వినియోగించిన రోగి మరింత అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. రోగి ఇంటి వద్దకు వెళ్లి సరైన వైద్య సేవలు అందిస్తామని వైద్య సిబ్బంది వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో ఇన్చార్జి లేకపోవడం ఆస్పత్రి పనితీరు నిర్లక్ష్యానికి నిదర్శనంగా భావించవచ్చు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు రోగులకు సరైన వైద్య సేవలు అందించడం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రులపై రోగులకు నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందించేందుకు తగిన ఏర్పాట్లను చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించిన రోగులకు మాత్రం సరైన వైద్య సేవలు అందడం లేదనేది నగ్నసత్యం, ఇప్పటికైనా ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యులు సేవా భావంతో మెలుగుతూ ఆపదలో ఉన్నవారికి ఆదుకునే గుణాన్ని అలవర్చుకోవాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular