ద్రోణ అమరావతి
విశాఖపట్నంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని
వి ఎం ఆర్ డి ఏ భవనంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్బీఐ అధికారులు
భావిస్తున్నారు.
ఆ భవనంలోని ఐదో అంతస్తును కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ను ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ కోరారు.కాగా ప్రతి రాష్ట్రంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఉంటుంది దీంతో రాష్ట్రంలోనూ
ఈ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
