ద్రోణ హైదరాబాద్

ఇటికల పహాడ్ పోడు రైతులకు అండగా రెవెన్యూ మరియు అటవీ శాఖ అధికారులతో చర్చలు జరిపిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ
సిర్పూర్ మండలం ఈటికల పహాడ్ లో 30 సంవత్సరాలనుండి పోడు వ్యవసాయం చేసి దానిపై వచ్చిన పంటతో కుటుంబ పోషణ గా జీవనోపాధి సాగిస్తున్నా రైతుల కోసం విని రైతుల పక్షాన నిలిచిన భారతీయ జనతా పార్టీ
అటవీశాఖ అధికారులు ప్రతి సంవత్సరం దాదాపు 4 సంవత్సరాల నుండి 1500 ఎకరాలు స్వాధీన పరచుకుని,మళ్ళీ ఈ ఏడాది కూడా దాదా పుగా 500 ఎకరారు స్వాధీన పంచుకునే దిశగా అటవీశాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారాన్న
ఆ విషయాన్ని తెలుసుకున్నా భాజాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ,
సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదేశాలతో
అటవీశాఖ, రెవెన్యూ శాఖా అధికారులతో రైతుల పక్షాన రైతులకు న్యాయం చేసే దిశగా అధికారులతో ప్రతి రైతుకు ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఇస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని భారతీయ జనతా పార్టీ తరఫున అధికారులను డిమాండ్ చేయడం జరిగింది.
ఆ డిమాండ్ ను విన్న అధికారులు పై అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా ఆలోచిస్తామని వెళ్లిపోవడం జరిగింది.
సిర్పూర్ మండల అధ్యక్షులు శంకర్ గారు ,నేరెళ్ళ అశోక్ ,మండల ప్రధాన కార్యదర్శి మహేష్ , ఇటికల పహాడ్ గ్రామస్తులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోడు రైతులు పాల్గొన్నారు.
