సాగునీటి పారుదల శాఖ అధికారులతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ద్రోణ హైదరాబాద్
ఎలాగైనా కాలేశ్వరం ప్యాకేజీ 20. 21. 22.(ప్రాణహిత చేవెళ్ల) ప్రాజెక్టు పూర్తి చేసి కామారెడ్డి జిల్లా రైతులకు రెండు లక్షల 75 వేల ఎకరాలకు సాగునీరు అందించే ధ్యేయంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పనులు ప్రారంభించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం

అధికారంలో వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి అవుతే కాంగ్రెస్ పార్టీకి షబ్బీర్ అలీ కి పేరు వస్తుందని దానిపై కక్ష కట్టి, ఏలాంటి నిధులు విడుదల చేయకుండా తొక్కి పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో తను కలలుగన్న ప్రాజెక్ట్ ప్రాణహిత చేవెళ్ల 20. 21 .22 పూర్తి చేయాలని పట్టుదలతో ప్రతిరోజు అధికారులతో ముఖ్యమంత్రితో మంత్రులతో ప్రాజెక్టు విషయంలో చర్చలు జరుపుతూనే ఉన్నారు.

ఈరోజు తన నివాసంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లేష్ పోచమల్లు, వారి బృందంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అతి త్వరలో ప్రభుత్వం చే నిధులు మంజూరు చేయించి ప్రాణహిత చేవెళ్ల పనులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు.
