Saturday, February 21, 2026

నైపుణ్యం గల ఉపాధ్యాయులచే విద్య బోధన

ద్రోణ కామారెడ్డి

బీర్కూర్ మండల జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థిని, విద్యార్థులకు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కామారెడ్డి జిల్లా వీర శైవ లింగాయత్ జిల్లా అధ్యక్షులు అంబలి బసవరాజ్ పటేల్ విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్నం భోజనం, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన, నిపుణులైన అధ్యాపకుల చే విద్యా బోధన, అన్ని హంగులతో విశాలమైన గదులతో పాఠశాల భవనాలు, మౌలిక వసతులు కల్పిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చక్కగా చదువుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిందిగా విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. జిల్లా పరిషత్ బీర్కూర్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు కలెక్టర్, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, అన్ని రంగాల్లో స్థిరపడ్డారని గతంలో ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని సౌకర్యాలు లేవని ప్రస్తుతం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు మీకు ఉచితంగా కల్పిస్తుంది. మీ తల్లిదండ్రుల ఆశలు, కలలు నెరవేర్చేలా అధ్యాపకులు చెప్పేది శ్రద్ధగా ఆలకించి బంగారు బాటలు వేసుకుంటారని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ ఓబు నారాయణ, అబ్దుల్ హైమద్ మాజీ ఏఐసీసీ మెంబర్, మాజీ ప్రతి కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు నాగరాజు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యమ రాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అధ్యాపక బృందం కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular