కోటగిరి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న అయ్యప్ప స్వామి, సాయిబాబా మందిర నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనులను పరిశీలించిన మహా పాదయాత్ర గురు స్వాములు సూచన సలహాలను అందించారు. నిర్మాణ పనుల పట్ల స్వాములు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి స్థలాన్ని అందజేసిన పూల విట్టల్ సెట్ కుటుంబానికి అభినందనలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న కోటగిరి అయ్యప్ప స్వాములకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పనులను పరిశీలించిన వారిలో మహా పాదయాత్ర గురుస్వాములు కాళ్లకల్ నాగరాజు, నరసింహస్వామి, బిచ్కుంద విట్టాల్ స్వామి, కోటగిరి లైన్స్ క్లబ్ అధ్యక్షులు గోగినేని హనుమంతరావు తదితరులు ఉన్నారు.

