ద్రోణ హైదరాబాద్
దహేగాం మండలానికి చెందిన ఆరేళ్ల చిన్నారి సహస్రని అత్యాచారం చేసి చంపిన కామంధున్ని వెంటనే ఉరితీసే శిక్షించాలని,
ప్రజాసంఘాల నాయకులు మరియు సామాజిక కార్యకర్తలు కౌటాల మండల కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
చిన్నారి సహస్ర ఫోటోకి క్యాండిల్ వెలిగించి బస్టాండ్ ఏరియా లో ర్యాలి నిర్వహించి నివాళులు అర్పించారు.
చిన్నారి సహస్రకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, రాష్ట్ర అంతట ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని, ప్రభుత్వము వెంటనే స్పందించాలని హెచ్చరించారు.
