ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి జూన్ 14
తెలంగాణ ప్రభుత్వం 22 మందితో కూడిన రాష్ట స్థాయి ఆయిల్ ఫామ్ సలహా కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు 353 జి.ఓ. జారీ చేసింది. ఈ కమిటీలో ఖమ్మం జిల్లా నుండి వైరా శాసన సభ్యులు మాలోత్ రాందాస్ ని మెంబర్ గా నియమించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ అభివృద్ది కొరకు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తానని, ఆయిల్ ఫామ్ అధిక విస్తీర్ణంలో సాగులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తానని అన్నారు. ఆయిల్ ఫామ్ రైతులు మరియు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలతో సమస్యలను ప్రభుత్వ దృస్టికి తెస్తానని తెలిపినారు.ఈ కమిటీలో వారిని నియమించిన సందర్బంగా వైరా ఉద్యాన అధికారి ఆకుల వేణు శాసన సభ్యులు మాలోత్ రాందాస్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
