Saturday, February 21, 2026

తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొన్న

ద్రోణ నల్లగొండ ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గం
నార్కెట్‌పల్లి మండలం బ్రహ్మాణవెల్లంల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్ని విద్యార్థులకు పుస్తకాలు,దుస్తులు పంపిణీ
R&B సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ,జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి,జిల్లా ఎస్పీ చందన దీప్తి,జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ జయశంకర్ బడిబాటను తన స్వంత గ్రామం నుండే ప్రారంభంచిన మంత్రి కి ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో మంత్రి గారు ఈ పాఠశాలని జిల్లాలో ఒక ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేస్తారు.
నల్గొండలో ప్రతీక్ పౌండేషన్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు.మీ ఆశయలకు అనుగుణంగా నకిరేకల్ నియోజకవర్గంలో నాణ్యమైన విద్యను అందిస్తాం.
బ్రహ్మాణ వెల్లంల ప్రాజెక్టు,నార్కెట్‌పల్లి డిపోను పున ప్రారంభం చేయాలని కోరూతున్నాను.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నేను రైతు ఇంట్లో పుట్టిన రైతు బిడ్డని నేను ఈ గ్రామంలో 7వ తరగతి వరకు ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించిన,
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు..
ఎమ్మెల్యే వీరేశం ప్రజల మధ్య అనునిత్యం ఉంటు ఎమ్మెల్యే అయ్యరు.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు మన గ్రామానికి రావటం జరిగింది.వచ్చే నాలుగునెలల్లో బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు ను పూర్తిచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి ప్రారంభిస్తాం.కొత్తగా 20 బస్సులను నార్కెట్‌పల్లిడిపోకి అందిస్తాం.త్వరలో కొత్తగా 13 వేల టీచర్ పోస్ట్ లు భర్తీ చేస్తాం.పిల్లలు అందరూ బాగా చదువుకొవాలి.బ్రహ్మాణవెల్లంల లో త్వరలో ఇందిరమ్మ ఇండ్లులను మంజూరు చేస్తాం.
ఈ సంవత్సరం నుండి ప్రతి నెల ఒక్కసారి ఈ పాఠశాలకు వస్తాను.పాఠశాలకు మరింత అభివృద్ధి చేస్తాను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular