Saturday, February 21, 2026

బంగారం కొరకు కన్న తల్లి దండ్రులనే కడ తేర్చిన కసాయి కొడుకు

పేగు బందం మర్చిపోయి మానవ మృగలుగా మారిన కొడుకు, కోడలు

ఆడ బిడ్డ తల్లి దండ్రుల జాడ కొరకు వెతకని ఊరు లేదు, వెతకని జాడ లేదు

ఆడ కూతురు ఆందోళనతొ కిష్టయ్య, నర్సమ్మ ల మరణ వార్త బయట పడింది

25 రోజుల తర్వాత వీడిన సాకలి కిష్టయ్య, నర్సమ్మ డెత్ మిస్టరీ

ద్రోణ సంగారెడ్డి జూన్ 14

అతనొక నరరూప రాక్షస పుత్రుడు. అతడు చేసింది అంతా ఇంతా కాదు. అత్యాశకు పోయి దురు వ్యసనాలకు లోనై కన్న తల్లి దండ్రులనే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలానికి చెందిన సాదుల్లనగర్ నివాసి అయిన చాకలి లక్ష్మన్ బ్రతుకు తెరువు కొరకు దుండగల్ లొ ఒక ప్రైవేట్ ఉద్యోగం చెయ్యడానికి వెళ్ళాడు. అక్కడ అనేక దురువ్యసనాలకు లోనైన లక్ష్మన్ డబ్బుల కొరకు కన్న తల్లి మెడలో ఉన్న బంగారం పై కన్ను పడింది. ఎలాగైనా బంగారం తల్లి దగ్గర నుండి తీసుకోవడానికి పక్కా పథకం ప్రకారం గత నెల మే 22 రోజున తన తల్లి తండ్రులను దుందిగల్ తీసుకెళ్లాడు. అందరూ కలిసి ఆల్కహాలు సేవించి విందు చేసుకున్నారు. నిందితుడి భార్య తొ కలిసి 3.5 తులాల బంగారం మీద కన్నేసి సమయం కోసం ఎదురు చూశారు. ఎక్కడి వాళ్ళు అక్కడి నిద్రలో జరుకున్న తర్వాత సొంత తల్లి దండ్రులను గొంతునులిపి కడతేర్చాడు. దానికి అతని భార్య అనిత పూర్తిగా సహకరించి నట్టు తెలిసింది. ఆ తర్వాత కారులో నర్సాపూర్ అటవీ సమీపంలోని రాయరావు చెరువు చెట్ల పొదల్లో తల్లిదండ్రుల శవాల పై పెట్రోలు పోసి నిప్పంటించాడు. నికృష్టపు కొడుకు. ఇట్టి విషయాన్ని గప్ చుప్ గా ఉంచిన భార్య భర్తలు ఏమి తెలువనట్టు గా ఉన్నారు. ఆడ బిడ్డ తల్లి దండ్రుల జాడ కొరకు వెతకని ఊరు లేదు, వెత కని జాడ లేదు. ఇక పుట్టిన ఊరికి వచ్చి తన తల్లిదండ్రుల గురించి వాకబు చేసింది. అంతలో సాదుల్లా నగర్ లొ విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ప్రజలు గుమిగూడి కిష్టయ్య, నర్సమ్మ ల గురించి కొడుకు లక్ష్మన్ ని అడకూతురు గ్రామస్తులు కలిసి నిలదీశారు. గ్రామస్తులు కలిసి తల్లిదండులను నీవే తీసుకపోయావు ఏమిచేశావు అంటూ నిలదియ్యడంతొ నిందితుడు ఖంగుతున్నాడు. గ్రామస్తులు అందరూ కలిసి లక్ష్మన్ పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతొ తల్లిదండ్రులను తానే చంపినట్టు అంగీకరించినట్టు తెలిసింది. ఇట్టి విషయమై నింధితులైన లక్ష్మన్ అతని భార్య అనిత ను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular