బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులలో శుక్రవారం వైద్యశాఖ ఆయుష్మాన్ ఆరోగ్యమేల కార్యక్రమం నిర్వహించారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి, వర్ని, కోటగిరి, నవీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పలువురు చిన్నారులకు పరీక్షలు జరిపి వైద్య సేవలు అందించారు, చర్మవ్యాధికాస్తులకు వైద్య చికిత్సలు నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళ రైతులు మహిళలకు పలు ప్రత్యేక చికిత్సలను నిర్వహించారు. సాధారణ వ్యాధులకు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు సలహాలు వైద్యులు అందించారు. ఆయుష్మాన్ హెల్త్ మేళాను ప్రతినెల 14వ తేదీన ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు.








