కెనడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కి సన్మానం
ద్రోణ న్యూఢిల్లీ
విదేశీ పర్యటనలో భాగంగా కెనడాలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్మించి ఆటా మహాసభలకు ఆహ్వానం తీసుకున్న ఎమ్మెల్యే దొంతి అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం అక్కడి నుండి కెనడా దేశం పర్యటనకు వెళ్లిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కెనడాలో పర్యటిస్తున్న సందర్భంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF ) ఆధ్వర్యంలో ఫోరం సభ్యులు ఎమ్మెల్యేకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికి ప్రవాస భారతీయులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫోరం సభ్యులు నర్సంపేట ప్రాంత అభివృద్ధికి దొంతి చేసిన సేవలను కొనియాడారు. నర్సంపేట అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కెనడాలో ఉన్న తెలుగు వారందరి కలయికతో నిర్వహించిన ఈ అపూర్వ సమ్మేళనం.తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి సన్మానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ఎన్నారైల సహకారం మరువలేనన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు రాజకీ యంగా,ఆర్థికంగా సామాజికంగా రాణించి ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.రోశ భారతీయులు ఐక్యంగా ఉంటూ తెలంగాణతో పాటు నర్సంపేట ప్రాంత ప్రజల అభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కెనడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు.
