Saturday, February 21, 2026

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన

ద్రోణ పాలకుర్తి జూన్ 15

తొర్రురు మండలం హరిపిరాల గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆచార్య శ్రీ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థి విద్యార్థినీలకు దుస్తులు పుస్తకాలు పంపిణీ చేసిన స్థానిక శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో మొట్ట మొదటి సారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసిన చరిత్ర ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి
పాఠశాలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు చేశాం.త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం.విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టబో తున్న సీఎం రేవంత్ రెడ్డి .విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపించాలి.ఆ దిశగా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల మీద భరోసా కల్పించాలి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే పిల్లలకు దుస్తులు పుస్తకాలు పంపిణీ చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని, అలాగే విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేశామని, త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్న మని తెలిపారు.
ప్రతి ఒక్క ఉపాధ్యాయులు విద్యార్థులను బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల మీద భరోసా కల్పించి ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు, గ్రామ అధికారులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా మిత్రులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular