అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.AIPSU
పాఠ్య పుస్తకాల పేరుతో పాఠశాల దగ్గర్లో షెటర్ కిరాయికి తీసుకొని పుస్తకాలు అమ్ముతూ నిలువు దోపిడీ అరికట్టడంలో ప్రభుత్వ అధికారులు విఫలం
అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపడతాం .
AIPSU బోధన్ డివిజన్ కార్యదర్శి సాయికుమార్
ఈ రోజు బోధన్ విద్యాశాఖ ఆపరేటర్ మానస గారికి అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగాAIPSU బోధన్ డివిజన్ కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ… ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు పాఠశాల పక్కనే శేటర్ కిరాయికి తీసుకొని, అలాగే బోధన్ పట్నంలో గల కొన్ని బుక్స్టోర్లతో ప్రైవేట్ విద్యా సంస్థలు కలిసి పాఠ్యపుస్తకాలు అమ్ముతూ లాభం ధ్యేయంగానే పనిచేస్తున్నాయని అన్నారు . విద్యా హక్కు చట్టాన్ని లోబడి ఫీజులు నియంత్రించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అలాగే శేటర్ కిరాయికి తీసుకొని పాఠ్యపుస్తకాలు అమ్ముతూ కొన్ని రోజులుగా నర్సరీ, LKG,UKG పిల్లలకు 6000-8000 వరకు పాఠ్య పుస్తకాలు యూనిఫాంలో పేరిట తీసుకుంటూన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు విద్యాసంస్థలు సమస్యలతో స్వాగతం పలికాయని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కనీస సౌకర్యాలు లేని విధంగా తయారయ్యాయని పోటీ బడి అడ్మిషన్లు చేసుకుంటున్నారని, అదే విద్యా బోధనలో ఎటువంటి నాణ్యత లేదని ఆయన అన్నారు. ఇకనైనా ఎంఈఓ విద్యాశాఖ అధికారులు పాఠ్య పుస్తకాలు అధిక ధరల విక్రయిస్తున్న విద్యాసంస్థలపైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AIPSU నాయకులు జయంత్, పవన్, సాయి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
