Saturday, February 21, 2026

కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి

  • ఫీజుల నియంత్రణపై పాలకులకు చిత్తశుద్ధి లేదు
  • కాంగ్రెస్ తెస్తానన్న ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి
  • పుట్టగొడుగుల్లా అనుమతులు లేని కార్పొరేట్ పాఠశాలలు
  • అనుమతి లేని పాఠశాలలను వెంటనే మూసివేయాలి
  • ఎ.ఐ.డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బానోత్ రవి

కార్పొరేట్, ప్రయివేట్ స్కూల్స్ లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఎ.ఐ.డి.ఎస్.ఎఫ్ ఆల్ ఇండియా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి విద్యార్థి సంఘం ఆఫీసులో అయన మాట్లాడుతూ విద్యా శాఖ అధికారుల అలసత్వంతో కార్పొరేట్ యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్లు ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. పెరిగే ఫీజులతో పేద విద్యార్థులకు చదువులు అందని ద్రాక్షలా మారింది. సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ పై పాలకులకు, అధికారులకు చిత్తశుద్ది లేకపోవడంతో యాజమాన్యాలు ఫీజులు తమ ఇష్టా రాజ్యాంగ పెంచుతున్నాయి. రకరకాల పేర్లతో పుట్టుకొస్తున్న పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ మొదలు టై, బెల్టుల వరకు యాజమాన్యాలు నిర్ణయించిన ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా కూడా పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసిన దాకలాలు లేవు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా విచ్చ లవిడిగా కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అనుమతిలేని పాఠశాలలు వెంటనే మూసివేయాలని, లేని పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular