Saturday, February 21, 2026

నీట్ పరీక్షలపై సమగ్ర విచారణ జరిపి

విద్యార్థులకు న్యాయం చేయాలని

CPI డిమాండ్ నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ నీట్ యూజీ పరీక్ష వ్యవహారంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని సిపిఐగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని బీహార్ లో 30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం విక్రయించారని కొద్దిమందినీ అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయని అన్నారు. నీట్ పరీక్ష వ్యవహారంలో ఆరోపణలు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ప్రధాని మోడీ స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నీట్ పరీక్ష వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు

ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ జిల్లా నాయకులు పి రంజిత్, బి రఘురాం, పి హనుమన్లు, అంజలి, రాధాకుమార్, వంశీ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular