Saturday, February 21, 2026

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

ద్రోణ హైదరాబాద్

రాష్ట్ర ప్రజలకు బక్రీద్
శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి సీతక్క

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్తల అచంచలమైన భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటిచెపుతోందని మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular