Saturday, February 21, 2026

ఆర్మూర్ జర్నలిస్టు అశోక్ మృతి

ఆర్మూర్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు అశోక్ గుండెపోటుతో ఉదయం ప్రాణాలు విడిచారు.
గత 30 సం,,లుగా సీనియర్ పాత్రికేయులుగా సమర్థవంతమైన పాత్రను పోషిస్తూ, ఎన్నో మానవీయ కథనాలను రాసి వ్యవస్థను, హృదయాలను కదిలిస్తూ, ఎన్నో ప్రధాన సమస్యలను తన కలంతో విశదీకరిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ స్వచ్చా భారత్ ద్వారా పరిసరాలను శుభ్రoగా ఉంచుకోవాలని ప్రతి పౌరుడి బాధ్యతను గుర్తు చేసి, ఇటీవల ప్రముఖ పత్రికలో ఒక వృద్ధుడి దయనీయ స్థితిని మానవీయకోణములో కథనం రాసి ఆర్ ఎస్ ఎన్ సేవా ఫౌండేషన్, హైదరాబాద్ వారి ద్వారా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జర్నలిస్టుగా పురస్కారం అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ గోస్కోoడ అశోక్ ఇక లేరు అనే బాధాకరమైన వార్త తెలుపుటకు చింతిస్తున్నాం

మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో పరమ పదించారు. ఈరోజు సాయంత్రం 4 గం,, లకు అంతిమ యాత్ర కలదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular