ముక్తకంఠంతో నినాదించిన పొతంగల్ మండల కాంగ్రెస్
ద్రోణ బోధన్ జూన్ 16
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్ మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తేలేదని హెచ్చరించారు. అధికార దాహంతో పార్టీలు మార్చుతూ అధికారాన్ని అనుభవిస్తూ వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారం కోల్పోవడంతో ఆయన మతి భ్రమిస్తుందని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి 1983 లో కాంగ్రెస్ లో ఉండి పదవులు అనుభవించి తర్వాత టిడిపి లో చేరి పదవులు ,అధికారం అనుభవించి 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరి పదవులు అధికారం అనుభవించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కావడం తో అధికారం పదవి లేకపోయే సరికి అల్లాడిపోతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. పోచారం నియోజకవర్గం లో నాయకులను ఎదగనివ్వకుండా వారి కుటుంబ ఆధిపత్యాన్ని కొనసాగించేటట్లు ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టించి ఎంతోమంది కాంగ్రెస్ నాయకులను మనోవేదనకు గురిచేసిన పాపాత్ముడు పోచారం అని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ లోకి రావడానికి అర్హత లేదు రానివ్వము అని పోతంగల్ మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు,ఉపాధ్యక్షులు కార్యదర్శులు, కార్యకర్తల సాక్షిగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో మాజీ యం పి పి గంధపు పవన్, రామ్ రెడ్డి, డిసిసి డెలిగేట్ హన్మంతు, మాజీ యం పి టి సి హన్మంతు రావ్, యం పి టి సి కేశ వీరేశం , పోతంగల్ గ్రామ అద్యక్షులు పుల్కంటి సాయిలు, మండల యూత్ అధ్యక్షుడు మన్సూర్, మరియు అన్ని గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
