Wednesday, May 13, 2026

విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి

ద్రోణ హైదరాబాద్

కొమరం భీం జిల్లా సిర్పూర్ (టి) గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడా కాలనీకి చెందిన ఎల్ములే వరలక్ష్మి (12) ఇంట్లో ఉన్న కూలర్ తగిలి విద్యుత్ షాక్ తో మృతి చెందింది. విద్యార్థిని సిర్పూర్ లోని కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. ఎల్ములే గజానన్ కు నలుగురు సంతానం కాగా వరలక్ష్మి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular