ద్రోణ మంచిర్యాల Jun 18
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కాలనీలో దారుణం జరిగింది. మిట్ట రాజేందర్ అనే వ్యక్తి మద్యం మత్తులో సొంత పెద్దనాన్న, ఆయన కుమారుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. రూ. 2 లక్షల విషయంలో జరిగిన గొడవలో కత్తితో తమ్ముడు సుజిత్ గొంతు కోయగా, అడ్డుకోబోయిన సుజిత్ తండ్రి లచ్చయ్యపై దాడి చేశాడు. స్థానికులు ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
