ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి
ఇరాన్‌లోని ఈశాన్య నగరం కష్మార్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. ఈ ఘటనలో నలుగురు మరణించగా..120 మందికి పైగా గాయపడ్డట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 1:24 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం 10కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
