Saturday, February 21, 2026

జుక్కల్ లో ఘనంగా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు

ద్రోణ కామారెడ్డి ప్రతినిధి

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
బిచ్కుంద మండల అధ్యక్షులు గంగాధర్ మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కేక్ కట్ చేయించారు.అనంతరం విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.డోంగ్లీ మండల అధ్యక్షులు బస్వరాజ్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, చెట్లు నాటారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అస్పత్ వార్ వినోద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు.
అనంతరం జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular