Saturday, February 21, 2026

పటాన్ చెరు ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు

ద్రోణ హైదరాబాద్ జూన్ 20

హైదరాబాదులో గురువారం ఈడీ సోదాలు నిర్వహిస్తోం ది. పటాన్‌చెరు ఎమ్మెల్యే MLA గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు,బంధుల ఇళ్లలో నూ, సోదాలు కొనసాగుతున్నాయి.. మొత్తంగా ఏక కాలంలో మూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.
ఇక, తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular