కనీస వేతనాలను అమలు జరపాలి. రమేష్ బాబు డిమాండ్
ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లాలోని అలీ సాగర్, గుత్ప, లిఫ్ట్ ఇరిగేషన్ లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు నాలుగు నెలల నుండి వేతనాలు ప్రభుత్వం చెల్లించకపోవడంపై సిఐటి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన విస్తృత సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గుత్ప, అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ లో గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు గతంలో కాంట్రాక్టర్ చేసుకున్న ఒప్పందం మేరకు రెండు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించటానికి అంగీకరించారు. అందరికీ ప్రావిడెంట్ ఫండ్ ను జమ చేయడానికి ఒప్పుకొని రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వేతనాలను సక్రమంగా చెల్లించకుండా ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి వాయిదాలు వేస్తూ మూడు నాలుగు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తున్నారని కార్మికులు ఆవేదన వెలుగుచ్చారు. నెల అంతా పనిచేసినప్పటికీ వేతనాలు సక్రమంగా రాకపోవడంతో పూట గడవడం కష్టం అవుతున్న కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని కార్మికుల వేతనాలను సకాలంలో చెల్లించే విధంగా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో కాంట్రాక్టర్ తమకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస వేతనాలను అమలు జరపటం కానీ, ఉద్యోగ భద్రతను కల్పించడంలో కానీ, పిఎఫ్ ఈఎస్ఐ లాంటి మౌలిక సదుపాయాలను అమల్జర్పటంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఫలితంగా కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని అప్పుల పాలై వడ్డీలు చెల్లించలేక అర్ధాకలతో కుటుంబాలు బతుకుతున్నాయని ఆయన అన్నారు. తమ సమస్యల కోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా లేబర్ అధికారులకు తమ సమస్యలను పరిష్కారం చేయాలని వినతి పత్రం అందజేశారు.

ఈ సమావేశంలో లిఫ్ట్ ఇరిగేషన్ నాయకులు గణేష్, మైపాల్, కార్తీక్,, అజయ్, సతీష్, పవన్ తదితరులతోపాటు ఆయా కేంద్రాల నుండి కార్మికులు పాల్గొన్నారు.
