Saturday, February 21, 2026

నులి పురుగుల మందు పంపిణీ

జాతీయ నులి పురుగుల నివారణ దినం సందర్బంగా ఆర్మూర్ పట్టణములోని వడ్డెర కాలనీ లోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నులి పురుగుల నివారణకు అల్బెoడాజోల్ మాత్రలను ప్రభుత్వ వైద్య ఆరోగ్యాధికారులు ఉచితంగా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కౌన్సిలర్, ప్రముఖ న్యాయవాది సంగీతా ఖాందేష్ మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో వున్నారని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అన్ని చర్యలు చేపడుతున్నారని అన్నారు. విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు అందచేశారు. వైద్యాధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమములో వైద్య ఆరోగ్యాదికారులు డాక్టర్ ఫిర్దోస్ ఫాతిమా, ఆనంద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుమ్మల లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం, సంతోష్, వైద్య సిబ్బంది అనురాధ, సౌందర్య, ఆశ వర్కర్లు స్వప్న, భాగ్య మరియు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular