Saturday, February 21, 2026

విద్య వైద్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యం

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ను పురస్కరించుకొని హైదరాబాద్ లోని రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్ లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. పిల్లల శారీరక ఎదుగుదలకు సంబంధించి డీ వార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్య, వైద్య ను అందిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలకు, ఆసుపత్రులకు ప్రజలే ఓనర్లరన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, విద్య, వైద్యానికి కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు స్వయంగా డివార్మింగ్ టాబ్లెట్లను మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ వేశారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఆల్బెండజోల్ టాబ్లెట్లను విద్యార్థులకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో అంగన్వాడి సెంటర్ లలో 1వ సంవత్సరం నుండి 19వ సంవత్సరాల వయసు గల పిల్లలకు టాబ్లెట్లను అందిస్తున్నామన్నారు. నేటి నుండి జూన్ 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయించాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు.ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగం తీసుకోవాలన్నారు. మన పూర్వీకులు ఆరోగ్యం కోసం యోగాను వారసత్వం అందించారన్నారు. యోగా దినోత్సవం ను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విద్యతోపాటు సంస్కారవంతులుగా ఎదగాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్, రాజ్ భవన్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, వాకాటి కరుణ, వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, కలెక్టర్ అనుదిప్ దురశెట్టి, స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి, వైద్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular