Tuesday, February 17, 2026

ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శికామ్రేడ్ డి.వి. కృష్ణ స్మారక స్థూపావిష్కరణ

2వ వర్ధంతి సభ ల ను జయప్రదం చేయాలి

విప్లవోద్యమ నేత,

శ్రామిక వర్గ యోధుడు,

  • నేల విడిచి సాము చేయరాదని

ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి:-

భారతదేశ విప్లవోద్యమ నేత, శ్రామిక వర్గ యోధుడు, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డి.వి. కృష్ణ స్మారక స్తూపావిష్కరణ, 2వ వర్ధంతి సభ ల ను జూన్ 26వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రేడియో స్టేషన్ కు ఎదురుగా చంద్ర నగర్ లో నిర్వహించడం జరుగుతుందని కరపత్రాలను పంపిణీ చేస్తూ బోధన్ పట్టణం లో మరియు కామ్రేడ్ డి వి కె సొంత గ్రామం పెంట కుర్దు మరియు సాలూర మండల కేంద్రాలలో బోధన్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది.

           

ఈ సందర్భంగా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ కామ్రేడ్ డీ వీ కే  1969 -70 లలో నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమం ప్రభావంతో తను చేస్తున్నా  ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉద్యమ బాట పట్టారని, 1975లో అజ్ఞాతవాసం కూడా  చేశారని ఆచరణలో తెలుసుకున్న అనుభవాలతో పని విధానంలో మార్పులు చేసుకుని  ఉద్యమంలో ముందుకు పోవాలని ఆ విధమైన పద్ధతులు, అనుభవాలతోనే సిద్ధాంతికరణ చేసి దేశ  విప్లవ ఉద్యమానికి   ఒక మార్గాన్ని చూపించిన గొప్ప సైదాంతిక మేధావి అని బి.మల్లేష్ కొనియాడారు. అదేవిధంగా నేల విడిచి సాము చేయరాదని నీటిలో చేపలాగా సమాజంలో ప్రజలతో కలిసే పని చేయాలని దానికోసం కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన, రైతు, మహిళా సంఘాల నిర్మాణాలు చేసి పోరాడాలని చెప్పడమే కాకుండా వాటి నిర్మాణం చేసి, అనేక ఉద్యమాలను చేపట్టి ఎన్నో విజయాలను సాధించారని 2022 - జూన్ 26వ తేదీన మరణించే వరకు దేశ విప్లవోద్యమాల గురించే ఆలోచించారన్నారు.
ఈ కార్యక్రమంలో బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్ సహాయ కార్యదర్శి సుల్తాన్, సాయిలు, ఐ ఎఫ్ టి యు నాయకులు ఇర్షత్, పోశెట్టి, శంకర్, గంగాధర్, నాగేష్, లక్ష్మన్న, పరమేశ్వర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular