ద్రోణ హైదరాబాద్
ఎస్బిఐ స్టాఫ్ యూనియన్ డే, కామ్రేడ్ తారక్ నాథ్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్బిఐ ఎస్ యు హెచ్ సి నిజామాబాద్ మాడ్యూల్ డే జీ ఎస్ ఎంవి రమేష్ మాట్లాడుతూ…. తల సేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించినట్టు తెలిపారు. ఎస్బిఐ యూనియన్ పటిష్టత కోసం కామ్రేడ్ తారకనాథ్ అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎస్బిఐ స్టాఫ్ యూనియన్ డే జరుపుకోవడం ఉద్యోగులందరి ఐక్యతను చాటుతుందన్నారు. కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, ఈజీఎస్లు గురునాథ్, శ్రీనివాస్, ఆర్ఎస్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు సునంద, సుధాకర్, శ్రీనివాస్, అసిస్టెంట్ ట్రెజరర్ అరవింద్, వివిధ డివిజన్ల యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
