కష్టమొచ్చినా,నష్టమొచ్చినా మాజీ మంత్రి,మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటే మేమందరం ఉంటామని ఉమ్మడి కోటగిరి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏజాజ్ ఖాన్ మరియు కోటగిరి,పోతంగల్ మండల గులాబీ తమ్ముళ్లు స్పష్టం చేశారు.మాజీ స్పీకర్ బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ కండువ ను కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీనితో ఉమ్మడి కోటగిరి మండల వ్యాప్తంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరడాన్ని సంపూర్ణ మద్దతు పలుకుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడే తాము ఉంటామని వారికి సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. అలాగే ఉమ్మడి కోటగిరి మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో కార్యకర్తలతో కలిసి పని చేస్తామని వారు తెలిపారు.ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా పని చేస్తామని వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను,కార్యకర్తలను గౌరవిస్తామన్నారు.
