Wednesday, February 18, 2026

రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న పరిణామాలను గమనించి నేను వారిని మా ఇంటికి మనఃస్పూర్తిగా ఆహ్వానించాను అనీ మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి, రైతు సంక్షేమంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యమైనవి.నేను స్వయంగా రైతును. రైతుల కష్టసుఖాలు నాకు తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి రైతాంగానికి చేస్తున్న మంచి కార్యక్రమాలకు అండగా ఉండాలని ఆలోచించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా చేస్తున్న పనులను గమనిస్తున్నాను, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో సమస్యలు సహజం, అయినప్పటికీ చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి దైర్యంతో వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళుతున్నారు. వారిని, రాష్ట్ర మంత్రి వర్గాన్ని అభినందిస్తున్నాను.నేను కూడా మంచి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నాను. నా జీవితంలో రాజకీయంగా ఆశించడానికి ఏమి లేదు. నేను ఆశించేది రైతుల అభివృద్ధి లక్ష్యంగా భావిస్తూ ముందుకు సాగుతా.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular